అల్లు అర్జున్ కి కరోనా నెగటివ్…ట్విట్టర్ ద్వారా వెల్లడి!

Wednesday, May 12th, 2021, 12:08:35 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే సెలబ్రిటీ లు సైతం ఈ మహమ్మారి భారిన పడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది అంటూ చెప్పుకొచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తాజాగా కరోనా వైరస్ నెగటివ్ వచ్చింది. కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు అని, ఆరోగ్యం గా ఉన్నట్లు బుదవారం నాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వైరస్ నెగటివ్ గా నిర్దారణ అయ్యింది అని అన్నారు. అయితే తన ఆరోగ్యం కోసం ప్రార్దనలు చేసిన అభిమానులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గించడం లో లాక్ డౌన్ ఉపయోగ పడుతుంది అని వ్యాఖ్యానించారు. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. మీ ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే కరోనా వైరస్ నెగటివ్ రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో స్మగ్లర్ పాత్ర లో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రం గా రానున్న ఈ చిత్రం ఆగస్ట్ నెల లో విడుదల కానుంది.