బాలీవుడ్ లోకి అల్లు అర్జున్ .. దాదాపు ఖరారు ?

Friday, September 7th, 2018, 03:18:11 PM IST

అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లోకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే .. ఈ మధ్య బాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హావ మాములుగా లేదు. అందుకే పలువురి బయోపిక్ సినిమాలను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఇండియా కు క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత కథతో ఓ బయోపిక్ తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. 83 టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడట.. ఇంతకీ అయన పాత్ర ఏమిటో తెలుసా .. క్రికెటర్ శ్రీకాంత్ గా కీ రోల్ పోషిస్తాడట. కపిల్ దేవ్ వరల్డ్ కప్ సాధించడంలో క్రష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కీలకం కాబట్టి ఆయన పాత్రకోసం అల్లు అర్జున్ ని అడిగారట. ప్రస్తుతం కబీర్ ఖాన్ అల్లు అర్జున్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట. సో బన్నీ కూడా ఓకే చెప్పేలా ఉన్నాడట. నా పేరు సూర్య ప్లాప్ తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments