అందుకేనా బన్నీ నిర్మాతగా మారుతున్నది ?

Sunday, October 21st, 2018, 02:28:32 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు క్రేజీ హీరోగానే చూసాం .. కానీ ఇప్పుడు అదే క్రేజ్ తో నిర్మాతగా మారుతున్నాడు. ప్రస్తుతం దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ కు సపరేట్ గా బ్యానర్ పెట్టాల్సిన అవసరం లేదు .. ఎందుకంటే ఇప్పటికే గీత ఆర్ట్స్ అనే ప్రతిష్టాత్మక బ్యానర్ ఉంది. అల్లు అరవింద్ నేతృత్వంలో ఎన్నో సంచలన చిత్రాలను నిర్మించారు. అయితే అల్లు అర్జున్ సొంతంగా బ్యానర్ పెట్టడానికి ప్రత్యేక కారణం తన అభిరుచికి తగ్గట్టుగా చిన్న బడ్జెట్ తో మంచి చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలు పెట్టనున్నాడట. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సొంతంగా బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. కొన్ని బ్యానర్స్ తో కలిసి పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నారు .. ఇప్పుడు అదే తరహాలో అల్లు అర్జున్ కూడా బిజినెస్ లో పార్ట్నర్ గా కూడా సినిమాలు చేస్తాడట. సో త్వరలోనే ఈ బ్యానర్ పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments