నిర్మాతగా అడుగులు వేస్తున్న అల్లు అర్జున్ ?

Saturday, March 10th, 2018, 03:51:34 PM IST

స్టైలిష్ స్టార్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మరో కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇప్పటి వరకు స్టార్ హీరోగా భిన్నమైన పాత్రలు చేసిన అల్లు అర్జున్ ఇకపై నిర్మాత అవతారం ఎత్తనున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను, తన అభిరుచికి నచ్చిన సినిమాలను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సారి దర్శకుడు క్రిష్ తో ఓ ప్రయత్నం చేయనున్నాడట. క్రిష్ తో అల్లు అర్జున్ చేసిన వేదం సినిమా నటుడిగా అల్లు అర్జున్ ని ఓ మెట్టు పై నిలబెట్టింది. అందుకే ఈ సారి క్రిష్ తో మరో ప్రయత్నం చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. అయితే ఈ సినిమాకు క్రిష్ తో కలిసి నిర్మాతగా చేస్తాడట. ప్రస్తుతం క్రిష్ హిందీలో మణికర్ణికా సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా పూరయిన తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడట క్రిష్. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమా తరువాత ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.