రొటీన్‌గా విష్ చేస్తే ఎలా.. అందుకే అల్లూవారిలా..!!

Thursday, January 26th, 2017, 12:44:10 PM IST

allu-daughter
దేశ‌మంతా ఒక‌టే నినాదం.. మేరా భార‌త్ మ‌హాన్ .. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని దేశ‌మంతా జెండా వంద‌నంతో మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌ల్ని కానిచ్చేశారు. అంద‌రిలాగా చేస్తే ప‌ర‌మ‌రొటీన్ .. అందుకే అల్లూ వారు కాస్త కొత్త‌గా, క్రియేటివ్‌గా చేశారు.

జాతీయ‌ జెండాపై అల్లు వారి మ‌న‌వ‌రాలు, బ‌న్ని గారాల ప‌ట్టి అర్హ ఫోటోని ప్రింట్ చేసి దేశ ప్ర‌జ‌లంద‌రికీ రిప‌బ్లిక్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలుపు వ‌ర్ణం డ్రెస్‌లో అర్హ క్యూట్‌గా జెండాపై అమ‌రిపోయేలా చేసిన డిజైన్ ఆక‌ట్టుకుంది. విశాఖ‌లో నేడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాన్ మ‌ద్ధ‌తుతో చేస్తున్న యూత్‌ మౌన పోరాట ఉద్య‌మానికి మెగా హీరోలంతా బాస‌ట‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆల్మోస్ట్ మెగా హీరోలంతా విశాఖ ఆర్కే బీచ్‌కి వెళుతున్నారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల బ‌న్నికి కుద‌ర‌లేదని తెలుస్తోంది.