సూర్యతో కోస్టార్ గా అల్లు శిరీష్

Thursday, May 17th, 2018, 04:20:01 PM IST

సూర్య ఇటు తెలుగు అటు తమిళంలో హిట్టు మీద హిట్టు కొడుతూ అదిరిపోయే కథలతో అభిమానులకు మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు అందిస్తున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలు తీయడంలో దిట్ట అయిన కే.వీ ఆనంద్ ఇప్పుడు సూర్య 37వ చిత్రానికి దర్శకత్వం చేయనున్నాడు. సూర్య, కే.వీ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్, లాంటి తమిళ సినిమాలు తెలుగులో కూడా పెద్ద కమర్షియల్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ వీరిదరి కాంబినేషన్ లో ఇంకో చిత్రం రావడం పెద్ద విషయమే అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మరో విశ్లేషకరమైన విషయమేటంటే అల్లు శిరీష్ కూడా ఈ చిత్రంలో సూర్యకి కోస్టార్ గా నటించనున్నాడు.

ఇదివరకే ప్రముఖ మళయాళ స్టార్ మోహన్ లాల్ తో 1971 చిత్రంలో నటించి అభిమానుల మన్నలను పొందిన శిరీష్ ఇప్పుడు సూర్యతో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళం లోనే కాకుండా ఇతర భాషలలో కూడా తీసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్డమయ్యారట. ఇప్పుడు మళయాళ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు. మళయాళ మోహన్ లాల్, తమిళ సూర్య, తెలుగు శిరీష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పెద్ద కమర్షియల్ మూవీగా నిలువబోతుందని ఇటు సూర్య, అటు శిరీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments