మలయాళ రీమేక్ తో వస్తున్న మెగా హీరో?

Sunday, April 29th, 2018, 09:31:32 AM IST

స్లో అండ్ స్టడీ గా సినిమాలు చేస్తున్న మెగా హీరో అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక్కక్షణం సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా వి ఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు పెంచుకుంది .. కానీ విడుదల తరువాత పరిస్థితి మారింది. ఇక ఈ సారి ఎలాగైనా మంచి విజయం అందుకోవాలని ఆలోచనలో ఉన్న శిరీష్ కాస్త బ్రేక్ తీసుకుని స్ట్రైట్ సబ్జెక్టు కాకుండా ఓ సూపర్ హిట్ రీమేక్ సినిమాతో వస్తున్నాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఎబిసిడి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో దుల్కర్ సల్మాన్ కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. దాంతో ఎబిసిడి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నెల 30 న అంటే రేపు ఈ సినిమా ప్రారంభం కానుంది. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్, యాష్ రంగినేని నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments