అల్లు వార‌బ్బాయ్ టాప్ సీక్రెట్ లీక్‌

Wednesday, May 30th, 2018, 03:23:54 AM IST


అల్లు శిరీష్ .. ప్ర‌స్తుత స‌న్నివేశ‌మేంటి? ఒక్క క్ష‌ణం ఫ్లాప్ త‌ర‌వాత అలికిడి అన్న‌దే లేదే.. అని ప్ర‌శ్నిస్తే అంత తేలిగ్గా తీసుకోవ‌డానికేం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. శిరీష్ ప్ర‌స్తుతం ప్లానింగ్ ఛేంజ్ చేశాడు. కొత్త జంట‌, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి చిత్రాలు త‌న‌కు విజ‌యాల్ని ఇచ్చాయి కాబ‌ట్టి.. ఇక‌మీద‌ట అలాంటి హిట్లు కొట్టే సినిమాలే చేస్తాడ‌ట‌. అయితే హిట్టు మ‌న చేతిలో లేదు ఒక్క క్ష‌ణం అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌దొక్క‌టి అన్న చందంగా రిజ‌ల్ట్ రావ‌డంతో ఈసారి చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌.

ఇదే విష‌యాన్ని బ‌ర్త్‌డే ఇంట‌ర్వ్యూలో పూస‌గుచ్చిన‌ట్టు చెప్పాడు. ఇక‌పోతే ఇప్ప‌టికిప్పుడు `ఎబిసిడి` అనే మ‌ల‌యాళ చిత్రం రీమేక్‌లో న‌టిస్తున్నాన‌ని వెల్ల‌డించాడు. డ‌బ్బు విలువ తెలియ‌ని ఓ రిచ్ కిడ్ ని స్ల‌మ్ములోకి పంపిస్తే అటుపై ఏం జ‌రిగింది? అన్న‌ది ఆ సినిమా క‌థాంశం. దుల్కార్ స‌ల్మాన్ మ‌ల‌యాళంలో పోషించిన పాత్ర‌లో శిరీష్ న‌టించనున్నాడు. సంజీవ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఒక్క క్షణం చూసి కెవి. ఆనంద్ సూర్య – మోహ‌న్ లాల్ సినిమాలో అవ‌కాశం ఇచ్చార‌ని శిరీష్ తెలిపారు. ఇరుగుపొరుగున అవ‌కాశాలు ఎప్పుడూ ఎవ‌రో ఒక కామ‌న్ ఫ్రెండ్ వ‌ల్ల వ‌స్తుంటాయ‌ని చెప్పాడు. మొత్తానికి అల్లు శిరీష్ చాలానే ప్లాన్‌లో ఉన్నాడు. ఇక‌మీద‌ట కెరీర్ ప‌రంగా స్పీడ్ పెంచేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments