రాజకీయాల్లోకి అల్లూ శిరీష్

Wednesday, November 30th, 2016, 12:21:28 PM IST

Allu-Sirish (1)
గౌరవం సినిమాతో ప్లాప్ ని చవిచూసినా రెండవ సినిమా కొత్త జంటతో హిట్టు కొట్టి మూడవ చిత్రం శ్రీరస్తు శుభమస్తు తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లూ శిరీష్. తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల గురించి తనకి సంబంధం లేకపోయినా మాట్లాడాడు అల్లూ శిరీష్. ఈ ప్రాంతం లో బీజేపీ గెలవడం తనకి చాలా సంతోషంగా ఉంది అంటున్నాడు ఈ మెగా హీరో. ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా కష్టాలు ఎదురైనా, ప్రజలు దానిని సమర్థిస్తున్నారు. దీని అమలులో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఆపత్కాలంలో మనం ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి సమాధానమిచ్చిన ఓ అభిమాని ‘రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వచ్చారు సర్‌?’ అని ప్రశ్నించాడు. దీనికి శిరీష్ సమాధానమిస్తూ…‘నేను రాజకీయ వ్యవస్థలో ఇప్పటికే భాగస్వామిని అయ్యాను. ఓటరుగా.. అధికారం, పదవుల వాంఛ నాకు లేదు. కృతజ్ఞతలు’ అని సమాధానమిచ్చాడు. ఇతని సమాధానాలు చూస్తుంటే త్వరలో రాజకీయాలలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనిపిస్తోంది కదూ !