మెగాఫ్యాన్స్‌కి `కాబోయే అల్లుడు` టెన్ష‌న్‌?

Saturday, May 19th, 2018, 02:18:41 AM IST


మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ హీరో అవుతున్న శుభ సంద‌ర్భ‌మిది. వారాహిచ‌ల‌న‌చిత్రంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం డ‌బ్బింగు ప‌నుల వ‌ర‌కూ వ‌చ్చింది. అదంతా అటుంచితే.. మెగాస్టార్ చిరంజీవికి, చిరు ఫ్యాన్స్‌కి `కాబోయే అల్లుడు` టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌న్న మాటా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అస‌లింత‌కీ ఏమీ అల్లుడు క‌థ అని ప‌రిశీలిస్తే చాలానే సంగ‌తులు తెలిశాయి.

నిన్న‌టికి నిన్న ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాన‌ని తేజ ప్ర‌క‌టించ‌డం పెనుకంప‌నాల‌కు కార‌ణ‌మైంది. ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ అంటే అది క‌చ్ఛితంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేదేన‌ని అంతా భావిస్తున్నారు. ఉద‌య్ కిర‌ణ్ క‌థ‌లో మెగా ఫ్యామిలీ ఓ భాగం. మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత‌తో ఉద‌య్‌కిర‌ణ్ నిశ్చితార్థం ఎపిసోడ్ ఎట్టి పరిస్థితిలో స్కిప్ కొట్ట‌లేనిది. నిశ్చితార్థం త‌ర‌వాత పెళ్లి ర‌ద్దు అవ్వ‌డం అన్న ఎపిసోడ్‌తోనే ఉద‌య్ కిర‌ణ్ కెరీర్‌ డౌన్‌ఫాల్ మొద‌లైంది. పెళ్లి ఆగిపోవ‌డం.. కెరీర్ ప‌రాజ‌యం పాల‌వ్వ‌డం.. మెగా ఫ్యాన్స్‌కు ఉద‌య్ దూర‌మ‌వ్వ‌డం అవ‌న్నీ కీల‌క‌మైన ఎపిసోడ్స్. వాటిని ట‌చ్ చేయ‌కుండా తేజ సినిమా ఎలా తీస్తాడు? ఎలా తీయ‌గ‌ల‌డు? అంటూ ఒక‌టే విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి. ఇక ఈ సినిమాకి `కాబోయే అల్లుడు` అనే టైటిల్‌ని తేజ డిక్లేర్ చేసేశాడ‌ట‌. ఈ టైటిల్ విన‌గానే ఇది క‌చ్ఛితంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసే ప్ర‌య‌త్న‌మేనని చెప్పుకుంటున్నారు. ఇక‌పోతే ఈ టైటిల్ ఏ సినిమా కోసం అన్న‌ది తేజ తేల్చాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments