డ్రీమ్ హీరోకి అమలాపాల్ బిస్కెట్లు..జీవితానికి అదే గొప్ప అట..!

Friday, December 1st, 2017, 06:07:54 PM IST

వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల తరువాత అమలాపాల్ పూర్తిగా సినిమాపైనే దృష్టి పెట్టింది. ఈ తమిళ్ లో మంచి అవకాశాలే దక్కుతున్నాయి. అమలాపాల్ ‘తిరుట్టు పాయాలే 2’ తాజాగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అమల తన డ్రీమ్ హీరో గురించి చెప్పుకొచ్చింది. తెలుగు తమిళ భాషల్లో చాలా మంది స్టార్ లతో నటించాను. కానీ అజిత్ తో నటించాలనే కోరిక ఇంకా తీరలేదు.

అజిత్ సరసన నటించే ఛాన్స్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోను. అజిత్ మంచి నటుడే కాదు.. మంచి వ్యక్తి కూడా అంటూ తెగ పొగిడేసింది. అజిత్ సినిమాలన్నా, ఆయన నటనన్నా చాలా ఇష్టం అని తెలిపింది. అజిత్ సినిమాలో ఛాన్స్ వస్తే.. నా జీవితానికి అదే గొప్ప అవకాశం అని చెప్పుకొచ్చింది. ఓ రేంజ్ లో అమల నుంచి పొగడ్తల వర్షం కురిపించుకున్న అజిత్ ఈ అమ్మడిని కరుణిస్తాడో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments