హీరో ధనుష్ కు, నాకు మధ్య ఏదో ఉందంటున్నారు అంటున్న స్టార్ హీరోయిన్

Monday, January 30th, 2017, 02:07:02 PM IST

AMALA-PAUL
మూడు సంవత్సరాలు ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో రెండు సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు విడాకులు తీసుకుని మళ్ళీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ అమలాపాల్. ఇష్టమైన కెరీర్ ను వదులుకోవాలా…? లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదులుకోవాలా…? అనే ప్రశ్న ఉత్పన్నమైనపుడు భర్తను వదులుకోవడానికి సిద్దపడి సంచలనం సృష్టించింది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమాలలో నటిస్తూ పెళ్ళికి ముందులానే అభిమానులను అలరిస్తుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమేనని, ఎవరైనా కలిసి ఉండాలనే అనుకుంటారు కానీ విడాకులు కావాలనుకోరని, కలిసి సంతోషంగా లేనపుడు విడాకులు తీసుకోవడమే మంచిదని ఆమె అభిప్రాయపడింది. విడాకులు తీసుకున్నా ఒక వ్యక్తిగా విజయ్ ను ఇప్పటికీ ఇష్టపడుతున్నానని, ప్రేమిస్తున్నానని ఆమె చెప్పింది. నేను తీసుకున్న నిర్ణయానికి నా బ్రదర్ సపోర్ట్ గా నిలిచాడని, అతని సపోర్ట్ జీవితాంతం మర్చిపోలేనని ఆమె అంటుంది. ఆ సమయంలో హీరో ధనుష్ కూడా తనకు అండగా నిలబడ్డాడని, దాంతో ధనుష్ కు, నాకు మధ్య ఎదో సంబంధం ఉందని పుకార్లు వచ్చాయని ఆమె చెప్పారు. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి సహాయం చేస్తే ఏదో సంబంధం ఉంటేనే చేస్తారా…? అని అమల ప్రశ్నించారు.

అంతేకాదు తాను వేసుకుంటున్న డ్రెస్ లపైన వస్తున్న విమర్శలకు ఆమె స్పందించారు. పెళ్ళికి ముందు తనను ఫ్యాషన్ ఐకాన్ అనేవారు. ఇప్పుడేమో విమర్శిస్తున్నారు. విడాకులు తీసుకున్నాక అమల హాట్ హాట్ డ్రెస్ లు వేస్తుందని అందరూ విమర్శిస్తున్నారు. ‘ఏం విడాకులు తీసుకుంటే మోడరన్ గా ఉండకూడదా…? నాకు నచ్చిన. నా బాడీకి సరిపోయే డ్రెస్ లు నేను వేసుకుంటాను అని ఆమె స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత కోలీవుడ్ లో కొంతమంది నన్ను నిషేదించాలని చూసారని, అయితే వాళ్ళు తనను ఏమీ చేయలేకపోయారని ఆమె అన్నారు. ఈ సంవత్సరం కోలీవుడ్ లో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయని, కన్నడంలో ఒక సినిమా విడుదల కాబోతుందని ఆమె చెప్పారు.