పాపం అమల.. అందరూ వాడేస్తున్నారు

Tuesday, February 28th, 2017, 01:26:50 PM IST


యాక్టింగ్ లో సూపర్ టాలెంట్ , పేరు ఉన్న హీరోయిన్ అమలా పాల్. ఎంత టాలెంట్ ఉన్నా కూడా తెలుగులో గ్లామర్ చించింది బాగానే సక్సెస్ అయ్యింది ఆమె. సరిగ్గా అదే టైం కి ఆమె పెళ్లి ఆగిపోవడం గొడవలు జరగడం తో క్యారెక్టర్ లు బాగుంటేనే సినిమాలు చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇలోగా పెళ్లి పెట్టాకులు కావడం తో ఆమె మళ్ళీ గ్లామర్ కి ఒప్పుకుంది అంటున్నారు. అలా మ్యారేజ్ బ్రేకప్ అవ్వగానే అమల ఒప్పుకున్న తొలిసినిమా.. కన్నడలో హెబ్బులి. హ్యాపెనింగ్ స్టార్ సుదీప్ పక్కనే హీరోయిన్ గా ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది. కాకపోతే సినిమాలో ఆమె పేరుకు ఒక డాక్టర్ రోల్ చేసిందనే కాని.. అస్సలు ఏ మాత్రం మ్యాటర్ అనేదే లేదు. కేవలం పాటల్లో గ్లామర్ ఆరబోయడానికి మాత్రమే వాడుకున్నారు. పైగా ఆ పాటలను చూస్తే అమలపై జాలేస్తుంది కూడా.