మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన అమల పాల్ – తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ ?

Tuesday, March 13th, 2018, 10:29:14 AM IST

కేరళ భామ అమల పాల్ హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఆ తరువాత సంసారంలో పొరపొచ్చాలు రావడం, విడిపోవడం జరిగింది. తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ట్రై చేస్తున్న ఈ భామకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. తమిళంలో రెండు మూడు సినిమాలు చేసిన అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. పైగా అమలా పాల్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలే అవి. అయితే ఈ భామ కాస్త గ్లామర్ విషయంలో కేర్ తీసుకుని మళ్ళీ స్టార్ హీరోయిన్ గా ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే ఉన్నాయి. అందుకే తన పాత్ర ప్రాముఖ్యతను బట్టే సినిమాలు ఎంచుకుంటుంది, ఏ అవకాశం వస్తే దానికి ఓకే చెప్పడం లేదట. తాజాగా తేలుగులో రెండు, తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపొందే సినిమాలో అమల పాల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారట. దాంతో పాటు నాగార్జున, నాని ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టి స్టారర్ సినిమాలో కూడా అమల పాల్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు ఈ సినిమాల్తో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.