షాకిచ్చిన అమలాపాల్.. మేకప్ లేకుండా అందుకు సై..!

Wednesday, January 3rd, 2018, 07:59:27 PM IST

ఆ మధ్యన విడుదలైన అమలాపాల్ చిత్రం తిరుట్టుపయాలే 2 లో తన నడుము అందంతో సెగలు రేపింది. నా నడుముకు ఇంత ఫాలోయింగ్ ఉంటుందనుకోలేదు అని హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా అంతకన్నా ఘాటు వ్యాఖ్యలు చేసి తన అభిమానుల్లో హీట్ పెంచేసింది. లిప్ లాక్ సీన్లలో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసింది. పైగా ఆ సీన్లలో లిప్ స్టిక్ వాడకుండా న్యాచురల్ గా నటిస్తా అంటూ ప్రకటించింది.

లిప్ లాక్ సన్నివేశాల్లో లిప్ స్టిక్ వాడడం అంత బాగోదు. సన్నివేశం పండదు. నావంతుగా సహజంగా నటించేందుకు ప్రయత్నిస్తా అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఈ మధ్యలో అమలాపాల్ గ్లామర్ డోస్ తో పాటు, ఘాటు వ్యాఖ్యలని కూడా పెంచేస్తోందండోయ్. అమల ఇంతలా చేంజ్ కావడానికి కారణం ఏంటని కోలీవుడ్ లో తెగ చర్చ జరుగుతోంది.