షాక్ .. అమలాపాల్ డోస్ పెంచింది అందుకేనా ?

Tuesday, September 4th, 2018, 08:45:37 PM IST

ప్రస్తుతం కోలీవుడ్ లో ఎక్కడ చుసిన అమల పాల్ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఆమె నటించిన తిరుట్టు పాయాలే 2 సినిమాలో ఓ రేంజ్ ల అందాలు ఆరబోసిందట. ఈ సినిమా చుసిన రసిక హృదయాలకు నిద్ర లేకుండా చేసిందని గుసగుసలాడుకున్నారు జనాలు. అమల పాల్ ఈ రేంజ్ లో గ్లామర్ షో ఎన్నడూ చేయలేదనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈమె రత్న కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ఆడాయి ఫస్ట్ లుక్ ని నేడు విడుదల చేసారు .. ఈ సినిమాలో కూడా అమల పాల్ గ్లామర్ ఓ రేంజ్ లో ఉంటుందని హింట్ వచ్చేసింది. చూడడానికి హారర్ థ్రిల్లర్ గా ఉన్నా కూడా ఇందులో అమల పాల్ హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ అయింది.

దర్శకుడు విజయ్ తో విడిపోయిన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు మళ్ళీ హీరోయిన్ గా నిలదొక్కుకునే క్రమంలో ఈ రేంజ్ లో గ్లామర్ షో చేసిందని అర్థం అవుతుంది. ప్రస్తుతం హీరోయిన్ గా నిలబడాలంటే గ్లామర్ తప్పని సరి. అయితే అది మరి శృతి మించిందని అంటున్నారు. ఏది ఏమైనా అమల పాల్ అందాలు ఈ సినిమాను ఎక్కడో నిలబెట్టిందని టాక్. తక్కువ సమయంలోనే సౌత్ లో హీరోయిన్ గా అటు తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అమల పాల్. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది.

  •  
  •  
  •  
  •  

Comments