వేధింపుల కేసు పెట్టిన అమలా పాల్ ?

Thursday, February 1st, 2018, 01:32:18 PM IST


సౌత్ భామ అమలా పాల్ తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ కేసు పెట్టింది. ప్రస్తుతం భర్త తో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న అమలా పాల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఓ కారు వ్యవహారంలో కోర్టు నోటుసులు ఎదుర్కొంటున్న ఈమె పై లైంగిక వేధింపులు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా .. ? అలిగేషన్ అనే వ్యాపారి !! అవును. అమలా పాల్ ఓ ఈవెంట్ కోసం డాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్లిన ఆమెను అలిగేషన్ అనే వ్యక్తి తీవ్రంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెన్నై లూనీ పాండి బజార్ లో కంప్లైంట్ చేసింది. దంటూ ఆతన్ని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారని, ఇలాంటి నీచులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది అమలా. ఇలాంటి వ్యక్తులకు సరైన శిక్ష పడితేనే నాలా ఎవరు ఇబ్బందులు పడరని అంటుంది. ఇప్పటికే కోర్టు కేసుల్లో ఉన్న అమలా పాల్ పోలీసు కేసు పెట్టడం సంచలనం రేపుతోంది.