మొత్తానికి ఇలా క‌క్ష తీర్చుకున్న అమ‌లాపాల్‌..!

Thursday, November 2nd, 2017, 12:45:47 PM IST

కోటిన్న‌ర విలువ చేసే టాప్ క్లాస్ బెంజ్ కార్‌ను సొంతం చేసుకుంది అమ‌లాపాల్‌. అయితే ఈ కార్‌ని కొనుక్కుని ట్యాక్స్ ఎగ్గొట్టింద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. దాదాపు 25ల‌క్ష‌ల మేర ప‌న్ను క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని ఏకంగా కేర‌ళ రాష్ట్రం వ‌దిలి ప‌క్క‌నే ఉన్న పాండిచ్చేరి వెళ్లి అక్క‌డ బెంజ్ కార్ ఆర్డ‌ర్ చేసింది. పైగా త‌న అడ్రెస్ ప్రూఫ్ ఇవ్వ‌కుండా వేరొక లోక‌ల్ ఇంజినీరింగ్ కుర్రాడి పేరు మీద ఆ బెంజ్ కార్‌ని రిజిస్ట్రేష‌న్ చేయించింది. దీంతో ఆ విష‌యం కాస్తా వివాదాస్ప‌ద‌మై.. ఏకంగా గ‌వ‌ర్న‌ర్ బ‌రిలోకి దిగి అమ‌లాపాల్ విష‌యంపై ఇన్వెస్టిగేష‌న్ చేయించారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అమ‌లా ప‌రువు పోయింద‌నే చెప్పాలి.

అయితే ఇంత జ‌రిగితే ప‌శ్చాత్తాపం చూపించాల్సింది పోయి.. అమ‌లా ఎలా విరుచుకుప‌డిందో తెలుసా? “ఒక‌ప్పుడు ఈ సిటీ లైఫ్ గంద‌ర‌గోళం నుంచి దూరంగా పారిపోవాల‌నుకున్నా. ఇదిగో ఇప్ప‌టికైతే ఇలా ప‌డ‌వ షికారుకొచ్చాను. ఈ ప‌ని చేస్తున్నందుకు చ‌ట్టంను ఉల్లంఘించాన‌ని అంటారా? శ‌్రేయోభిలాషుల అనుమ‌తి కోరాలా? “ అంటూ ట్విట్ట‌ర్‌లో పంచ్‌లు వేసింది. బోట్ షికారు చేస్తున్నా.. అందుకు కూడా రిజిస్ట్రేష‌న్ కావాలా? అంటూ వెట‌కారంగా వ్యంగ్యంగా ఆడిపోసుకుంది. మొత్తానికి బెంజ్ కార్ ఎపిసోడ్ అమ‌లాను చాలానే చికాకుల్లోకి నెట్టేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. అస‌లే విజ‌య్ నుంచి విడాకులు తీసుకున్నాక‌, అమ‌లా లైఫ్ స్టైల్ చాలా మారింది. ఇటీవ‌లి కాలంలో రెబ‌లియ‌న్ యాటిట్యూడ్‌తో నిరంత‌రం వార్త‌ల్లోకొస్తోంది. వేరొక వైపు క‌థానాయిక‌గానూ సీరియ‌స్‌గా బిజీ అయిపోయే ప్లాన్‌లో ఉంది అమ‌లా పాల్‌.

Comments