చంద్ర‌బాబు హెరిటేజ్ కి అలా బ్యాండ్ బాజా!!

Wednesday, June 5th, 2019, 09:07:57 PM IST

ఏపీలో రాజ‌ధాని పేరుతో ఇన్ సైడ్ ట్రేడింగ్ జ‌రిగిందా? క్యాపిట‌ల్ మిష‌తో భూముల్ని అడ్డ‌గోలుగా దోచుకున్నారా? ప‌్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా దీనిపైనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఈ భోగోతంలో చంద్ర‌బాబు ఫ్యామిలీకి చెందిన‌ హెరిటేజ్ పేరు కూడా తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

ఇదివ‌ర‌కూ ఓ రాజ‌కీయ నాయ‌కుడు కం రియ‌ల్ట‌ర్ సార‌థ్యంలో వంద‌ల ఎక‌రాల్ని కొన్నారు. రాజ‌ధాని వ‌స్తోంద‌ని తెలిసి ముందే రైతుల నుంచి ఎక‌రాల కొద్దీ ల్యాండ్ కొనిపించేశారు. అదే టైమ్ లో హెరిటేజ్ కంపెనీ కూడా 14 ఎక‌రాలు కొనుగోలు చేసిన‌ట్లు కొత్త గ‌వ‌ర్న‌మెంట్ ఆధారాలు సేక‌రించింద‌ట‌. హెరిటేజ్ కంపెనీ బాబు కుటుంబానిదే కావ‌డంతో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు ఆయ‌న‌ను కూడా చుట్టుముట్టే అవ‌కాశం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. రైతులు 30 వేల ఎక‌రాల భూమిని న‌మ్మి అప్ప‌గిస్తే తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇలా చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని తెలుస్తోంది.

అంతేకాదు ఈ భూముల గోల్ మాల్ వ్య‌వ‌హారంలో రికార్డులు మాయ‌మ‌వ్వ‌డం మ‌రో ట్విస్ట్. మొత్తం 29 గ్రామాల పరిధిలో 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,261 ఎకరాల భూమి ఉండగా 22,700 ఎకరాలు దేవాదాయ, పోరంబోకు, గ్రామకంఠం, రోడ్లు, చెరువులు, గుంటలు, డొంకలు, కరకట్ట‌లు, స్మశానాలు ఉన్నాయి. లంక భూములు సుమారు 2500 ఎకరాలు, అసైన్డ్ భూములు 2000 ఎక‌రాలు, సీలింగ్‌ భూములు 1500 ఎక‌రాలు, వివ‌రాలు లేనివి మరో 2000 ఎకరాలు మొత్తం కలిపి 7,500 ఎకరాలు ఉండగా ఈ భూముల రికార్డులు మొత్తం అనంతరం మాయమైనట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూముల‌ను, లంక భూములను కూడా తెలుగుదేశం పెద్ద‌లు కారుచౌక‌గా కొనుగోలు చేశారు. ఇక ఇప్ప‌టికే ఇన్ సైడ్ ట్రేడింగ్ కి కార‌కుడైన ఒక నాయ‌కుడు కం మంత్రిని అరెస్ట్ చేయ‌బోతున్నారంటూ విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. వేల కోట్ల రూపాయ‌లు ముడుపులు తీసుకోవ‌డం కార‌ణంగానే వంద‌లాది ఎక‌రాలు ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు ధారాద‌త్తం చేసిన‌ట్లు కూడా కీల‌క సాక్ష్యాలు ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్నాయి. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ నిరూపణ అయితే, ప్రభుత్వ రహస్యాలను బహిరంగ పరిచినందుకు సంబంధిత వ్యక్తులకు పెద్ద శిక్ష‌ప‌డుతుంద‌ని,.. క్విడ్ ప్రోకో నిరూప‌ణ అయితే శిక్ష మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.