తెలంగాణ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్న అమరావతి మహిళ.. న్యాయం చేయండి..!

Saturday, February 8th, 2020, 04:53:32 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు 53వ రోజుకు చేరుకున్నాయి. అందులోనే భాగంగా తమ కోరికను నెరవేర్చాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని మేడారం సమ్మక్క సారలమ్మకు అమరావతి మహిళలు నేడు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అంతకు ముందు అమరావతి జేఏసీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేపట్టి అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు బయలుదేరారు.

అయితే జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ నినాదాలను మేడారంలో వినిపించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి అనంతరం అక్కడే ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కాళ్ళు పట్టుకుని ఒక మహిళ భావోద్వేగానికి గురయ్యింది. తమ సమస్యలను ఏపీ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని కన్నీరు పెట్టుకుంది. అయితే వారిని ఓదార్చిన ఎమ్మెల్యే సీతక్క మహిళలు, రైతులు కన్నీరు పెట్టుకోవడం మంచిది కాదని, అమరావతి రైతులకు, మహిళలకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.