అమెజాన్‌కి అత‌డి వ‌ల్ల మిలియ‌న్ డాల‌ర్ న‌ష్టం!

Saturday, February 10th, 2018, 12:43:28 AM IST

హాలీవుడ్‌లో కొన్ని అనూహ్య ప‌రిణామాలు పెను ప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా హార్వే వీన్‌స్టీన్‌పై లైంగిక వేదింపుల ఆరోప‌ణ‌లు.. అటుపై ఉద్వాస‌న త‌ర్వాత ఒక్కొక్క‌రుగా రాస‌లీల‌ల గురూజీలు బ‌య‌టికొస్తున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క అమెజాన్ నుంచి ప్రైస్ అనే ట్యాలెంటెడ్ ఫిలింమేక‌ర్ ఈ త‌ర‌హాలోనే లైంగిక వేదింపుల ఆరోప‌ణ‌ల వ‌ల్ల కంపెనీ నుంచి త‌ప్పుకోవాల్సొచ్చింది.

ఆ క్ర‌మంలోనే అత‌డిని రీప్లేస్ చేస్తూ వృద్ధాగ్రేస‌రుడైన అలెన్ వూడీకి ఆ బాధ్య‌త‌ల్ని అప్ప‌జెప్పింది అమెజాన్‌. వూడెన్ బెస్ట్ ఫిలింమేక‌ర్ అయినా పాత ప‌ద్ధ‌తుల్ని అనుస‌రించి డిజిట‌ల్ సినిమాల్ని రూపొందించాడు. అయితే అవేవీ వ్యూవ‌ర్స్‌ని ఆక‌ర్షించ‌లేక‌పోయాయి. దాంతో మిలియ‌న్ల కొద్దీ డాల‌ర్లు పోసి తీసిన సినిమాల‌న్నీ రిట‌ర్నులు తేవ‌డంలో నిరాశ‌ప‌రిచాయి. ఆ క్ర‌మంలోనే అత‌డితో అప్ప‌టికే చేసుకున్న ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింది. వ‌రుస‌గా మూడు సినిమాలు చేయాల్సి ఉండ‌గా వాటిని ర‌ద్దు చేసుకున్నారు. దీనివ‌ల్ల దాదాపు 500-600 కోట్ల (80 మిలియ‌న్ డాల‌ర్లు ) మేర రిస్క్‌లో ప‌డిన‌ట్టేన‌ని అంచ‌నా వేస్తున్నారు. అమెజాన్‌కు ఇది నిజంగా ఊహించ‌ని విప‌త్తులాంటిదే. కాట్రాక్టులు ర‌ద్దు చేసుకోవ‌డం.. డీల్స్ మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం వంటి ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments