బాబుగారూ 4 ల‌క్ష‌ల 71 కోట్ల ఎంవోయూలేమ‌య్యాయ్‌?

Sunday, January 22nd, 2017, 11:50:58 AM IST

babu

దావోస్ టూర్ స‌క్సెసైంది. విదేశీ కంపెనీలు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి అంటూ బ్యాన‌ర్ వార్త‌ల‌తో ఏపీ హోరెత్తిపోయింది. అయితే అందులో నిజం ఎంతో తెలీదు కానీ, సీఎం చంద్ర‌బాబు చెప్పిన క‌బుర్లలో నిజ‌మెంతో తెలీని అయోమ‌యంలో ఉన్నారు ఏపీ జ‌నం.

అప్ప‌ట్లో విశాఖ న‌గ‌రంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక స‌మ్మిట్‌లో ప‌లు దేశాల‌కు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 4 ల‌క్ష‌ల 71 కోట్ల ఎంవోయూలపై సంత‌కాల ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. మాట‌లు ఘ‌నం.. చేత‌లు శూన్యం అన్న చందంగా ఒప్పందాలు వినేందుకు బావున్నాయి కానీ, అవ‌న్నీ ఎక్క‌డ అమ‌ల‌వుతున్నాయి. ఎక్క‌డ ఆ పెట్టుబ‌డులు..? రాష్ట్రానికి వ‌చ్చాయా? అంటే స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇదే విష‌యాన్ని వైకాపీ కీల‌క‌నేత అంబ‌టి రాంబాబు ఓ టీవీచానెల్ లైవ్‌లో అడిగి క‌డిగేశారు. ఏదైనా వైట్ పేప‌ర్‌పై అమ‌ల్లోకి వ‌చ్చిన విదేశీ పెట్టుబ‌డుల వివ‌రాలు అధికారికంగా అందించ‌గ‌ల‌రా? అంటూ స‌వాల్ విసిరారు అంబ‌టి. ఇవ‌న్నీ కేవ‌లం విదేశీ ప్ర‌యాణాల‌కు, విలాసాల‌కు మాత్ర‌మే బాబు వాడుకున్నారు. ప్ర‌స్తుత దావోస్ టూర్ అలాంటిదేన‌ని విమ‌ర్శించారు. ప్ర‌చారార్భాటం త‌ప్ప పెట్టుబ‌డులేవీ అంటూ ప్ర‌శ్నించారు. మ‌రి చంద్ర‌బాబు స‌మాధాన‌మేంటో?