బట్టలువిప్పి గోచి ఇచ్చారు..సిగ్గులేకుండా మాట్లాడకండి – అంబటి రాంబాబు చురకలు

Friday, July 12th, 2019, 01:35:36 PM IST

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా తీరు చూస్తే విస్తుపోవటం ఖాయం. సభ ప్రారంభమైన వెంటనే అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదనలు జరిగాయి. ఒక దశలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి హెచ్చరికలు కూడా జారీచేసే స్థాయికి వెళ్లాడంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోండి. జగన్ మాట్లాడుతుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుతగులుతుంటే ఒక దశలో జగన్ అసహనంతో మాట్లాడకుండా ఉండిపోయాడు.

ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతూ రైతులకి అంత చేశాం,ఇంత చేశామని చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెపుతున్నారు. సున్నా వడ్డీ రుణాలపై 5 శాతం మాత్రమే గత ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లించింది.
అంటే ఉన్న బట్టలు విప్పించి గోచి ఇచ్చి పంపారు. దానికే మేము గోచి ఇచ్చాము గోచి ఇచ్చామంటూ గొప్పలు చెపుతున్నారు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు, కనీసం ఆలోచన లేకుండా అసెంబ్లీ లో ఉన్నారు. మీరు ఇచ్చిన గోచి పెట్టుకున్న జనాలు మీకు తగిన శాస్తి చేస్తూ 23 స్థానాలు ఇచ్చిన కానీ మీలో మార్పు రాలేదు.

ఇందాక మా సభ్యులు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికే డౌన్ అయిపోయి 22 మందితో ఉన్నారు. మీరు ఇంకా డౌన్ డౌన్ అంటే ఎక్కడికి పోతాడు పాపం. కాబట్టి డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ ఆయన్ని అనకండి అంటూ గట్టి చురకలు అంటించాడు అంబటి రాంబాబు.