ఆ ముగ్గురిని ఆడేసుకున్న అంబ‌టి!

Friday, September 23rd, 2016, 12:32:06 AM IST

ambati-ramababu1
వైకాపా నేత అంబ‌టి రాంబాబు గొంతెత్తితే అవ‌త‌లివాడు గాన‌కోకిల అయినా మూగ‌పోవాల్సిందే. ఆయ‌న మ‌రోసారి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. మ‌రోసారి తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాల‌పై నిప్పులు చెరిగారు. అధికార పార్టీలు రెండింటీలోకి ఎమ్మెల్యేల జంపింగ్ విష‌య‌మై అంబ‌టి ఫైర్ అయ్యారు. ప్ర‌త్యర్థుల‌పై నివురు గ‌ప్పిన నిప్పులా విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేల‌ను కొంటున్నాడు. ఇక్క‌డ బాబు వైకాపా ఎమ్మెల్యేల‌ను కోట్ల రూపాయ‌ల‌తో కొనుగోలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీలో ఉనికి కోసం అర్ధం ప‌ర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు త‌ప్ప అందులో వాస్త‌వం ఎక్క‌డ క‌నిపించ‌లేద‌ని అన్నారు. టీ ప్ర‌భుత్వం విష‌యంలో ఉమ్మ‌డి హెకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ‌కే కాదు ఏపీకి వ‌ర్తిస్తుంద‌ని ఎద్దేవా చేశారు.

మీకు నిజంగా ద‌మ్ము ధైర్యం ఉంటే కొన్నుక్కున్న 20 మంది ఎమ్మెల్యేల‌చే రాజీనామా చేయించి త‌క్ష‌ణం బ‌రిలోకి దిగండి. ఎవ‌రి బ‌ల‌మెంత‌న్న‌ది తేలిపోతుంద‌ని బాబు స‌ర్కార్ కు మ‌రోసారి స‌వాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై మూడు నెల‌ల్లో అనర్హ‌త వేటు వేయాల‌న్నారు. ఇటు కాపుల విష‌యంలో బాబు తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని..ఈ ఒర‌వ‌డి మార్చుకోక‌పోతే భ‌విష్య‌త్తులో త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు.