చంద్రబాబు ఏదైనా కావాలంటే జగన్ చేస్తారు – అంబటి రాంబాబు

Sunday, August 18th, 2019, 02:30:18 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ఏపీలో వరదల కారణంగా ఉండవల్లిలో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందన్న వార్త వచ్చాయి. కాగా ఈమేరకు వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు కి అంత ఇబ్బందిగా ఉంటే ఒక ఇంటి కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పండి. జగన్ దాన్ని అన్ని రకాలుగా ఆలోచించి చంద్రబాబు కి తక్షణమే ఒక ఇంటిని ఏర్పాటు చేస్తారని అంబటి రాంబాబు తెలిపారు. కాగా ఈ విషయాన్నీ ఇప్పటికే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కూడా ఒకసారి ప్రస్తావించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఇదే విషయాన్నీ మరొకసారి అంబటి రాంబాబు చెప్పారు. కాగా ఇపుడు ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మిగతా ప్రజలతో పాటే ఆయనకు ఉగాది వరకు ఇంటికి సంబందించిన పట్టాను అప్పగిస్తామని చాలా వైనగంగా మాట్లాడుతున్నారు.

అంతేకాకుండా ఈమేరకు మాట్లాడిన అంబటి… ఈ డ్రోన్లను గత మూడు రోజులు నుంచి ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందని, అది కేవలం వరద ముప్పును మాత్రమే అంచనా వేయడానికి మాత్రమే వాడుతున్నామని, కానీ చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేయలేదని అంబటి రాంబాబు తెలిపారు. కానీ చంద్రబాబు ఇప్పటికి కూడా అక్రమ కట్టడంలో ఉంటూనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇలాంటి సంచలనాత్మకమైన వాఖ్యలు చేయడం సరికాదని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. కాగా ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాభావం వలన దగ్గర్లోని ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా డ్రోన్లను ఉపయోగించమని స్పష్టం చేశారు.