జూలై 1 నుండి ఏపీ లో అత్యాధునిక అంబులెన్స్, మొబైల్ క్లినిక్ సేవలు ప్రారంభం!

Tuesday, June 30th, 2020, 07:35:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనకు మచ్చుతునక గా ఈ అంబులెన్స్ మరియు మొబైల్ క్లినిక్ సేవలు చరిత్రలో నిలిచి పోనున్నాయి. అయితే జూలై 1 నుండి ప్రారంభం కానున్న అంబులెన్స్ మరియు మొబైల్ క్లినిక్ సేవల పై వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తపనకు కార్యరూపం జూలై 1 నుండి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. 203 కోట్ల రూపాయల తో కొనుగోలు చేసిన అత్యాధునిక అంబులెన్స్ మరియు మొబైల్ క్లినిక్ సేవలు ప్రారంభం కానున్నాయి అని తెలిపారు. వెంటిలేటర్స్, ఈసీజి, ప్రాణాపాయ స్థితిలో అత్యవసర లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు వీటిలో ఉంటాయి అని వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు నాయుడు పాలనలో అంబులెన్స్ సేవలు అంతంత మాత్రంగా నడిచేవి అని, ఓ పక్కన పడేసినట్లుగా మరొక ట్వీట్ లో చూపించారు. అది నాడు అని, నేడు జగన్ పాలన లో అంబులెన్స్ సేవల కొస్ భారీ మొత్తం ఖర్చు చేసి ప్రజారోగ్యం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యాధునిక సౌర్యాలతో ప్రారంభం కానున్న ఈ సేవల ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.