జీజీహెచ్‌లో యువకుడికి షాక్ ఇచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గంటలో పోతాడు..!

Sunday, July 26th, 2020, 02:01:42 AM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులలో బెడ్లు కూడా దొరకక పాజిటివ్ వచ్చిన పేషంట్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న బెడ్ల కొరతలో బెడ్ దొరకాలంటే ఎవరైనా పోవాల్సిందే అప్పుడు కానీ బెడ్ ఖాలీ అయ్యేలా కనిపించే రోజులు మారాయి.

అయితే కరోనా సోకిన ఓ యువకుడికి ఇదే అనుభవం ఏర్పడింది. బెడ్లు దొరకక అవస్థ పడుతుండడాన్ని అంబులెన్స్‌ డ్రైవరు గమనించాడు. నీతోపాటు వచ్చిన వాళ్లలో ఒక వృద్ధుడు బాగా దగ్గుతున్నాడు. అతడు గంటలో పోతాడు. ఆ తర్వాత నీకు బెడ్‌ కేటాయిస్తాం అని తెలిపాడు. ఇది విన్న ఆ యువకుడు ఒకింత షాక్‌కి గురయ్యారు.