మరో క్రేజీ బయోపిక్ లో .. అమీర్ ఖాన్ ?

Friday, July 27th, 2018, 12:25:08 PM IST

బాలీవుడ్ అంటేనే ఇప్పుడు బయోపిక్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. తాజగా మరో క్రేజీ బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. మనం ఎంతోమంది సినిమా స్టార్స్ ని చూస్తున్నాం .. వారి కథలు కూడా విని ఇన్స్పైర్ అవుతున్నాం .. కళ్ళకు చెప్పులు, ఒక్కపూట కూడా తినడానికి లేని స్థితి నుండి స్టార్ గా ఎదిగానని ఎంతోమంది కథలు విన్నాం .. నిజమే అలాంటి వారిలో .. ఎన్టీఆర్, మెగాస్టార్, దాసరి ఇలాంటి వారు చాలా మంది కనిపిస్తారు. ఇక బాలీవుడ్ లోకూడా అమితాబ్, అమీర్, షారుఖ్ .. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉంటారు. తాజా మ్యూజిక్ రంగంలో కింగ్ గా ఎదిగిన గుల్షన్ కుమార్ తెలుసుగా .. టి సిరీస్ కంపెనీ ఓనర్ అయినా గుల్షన్ కుమార్ కూడా పండ్ల రసాల దుకాణంలో కెరీర్ మొదలు పెట్టి బాలీవుడ్ లో క్రేజీ గా మ్యూజిక్ కంపెనీ ఓనర్ గా ఎదిగిన గుల్షన్ కుమార్ జీవితం నిజంగా అందరికి ఆదర్శం. ఇప్పుడు అయన జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుల్షన్ కుమార్ పాత్రలో మొదట అక్షయ్ కుమార్ నటిస్తారని వార్తలు వచ్చాయి కానీ మొఘల్ అనే టైటిల్ పెట్టడంతో అయన తప్పుకున్నారు .. ఇప్పుడు అయన స్థానంలో ఎవరు నటిస్తారా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది .. అన్నట్టు ఈ చిత్రాన్ని టి సిరీస్ కంపెనీ తో కలిసి అమీర్ ఖాన్ నిర్మిస్తాడట.

  •  
  •  
  •  
  •  

Comments