మహాభారతం ప్రాజెక్ట్ పక్కన పెట్టాడా ?

Tuesday, April 10th, 2018, 11:14:29 PM IST


ఈ మధ్య లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి పురాణాలు, చారిత్రక సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి స్పూర్తితో పలు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా హిందీలో భారీ బడ్జెటు తో మహాభారతం సినిమాను తెరకెక్కించే సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో అమీర్ ఖాన్ కర్ణుడిగా లేదా కృష్ణుడిగా నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అమీర్ ఖాన్ ఈ సినిమాలో నటించే విషయం పై ఆలోచనలో పడ్డాడని .. ఒకరకంగా ఈ సినిమాను పక్కన పెట్టాడని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో పలు వివాదాలు రేగి సినిమా విడుదలకు అడ్డం పడ్డ విషయాలు చాలా ఉన్నాయి. అలాగే ముస్లీమ్ వ్యక్తి అయిన అమీర్ ఖాన్ , కృష్ణుడి పాత్ర చేయడం ఏమిటి అనే విమర్శలు వినిపించాయట, దాంతో ఈ సినిమాలో ఈ పాత్ర చేస్తే ఖచ్చితంగా వివాదాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావించి ఈ సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేలే .. ఈ మధ్య సినిమాలను సినిమాలుగా కాకుండా ప్రతి వోడు .. మా మనోభావాలు దెబ్బ తింటున్నాయంటూ రచ్చ చేస్తే ఇలాగె ఉంటుంది వ్యవహారం.