అమీర్ ఖాన్ కోసం మహాభారతం అన్నేళ్ళు అంటే కష్టం! ఇక నీ ఇష్టం!

Thursday, September 28th, 2017, 06:05:54 PM IST

మోహ‌న్‌లాల్ – శ్రీ‌కుమార్ మీన‌న్ కాంబినేష‌న్‌లో `మ‌హాభార‌తం` 1000 కోట్ల బ‌డ్జెట్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఎస్.ఎస్‌.రాజ‌మౌళి మ‌హాభారతం పై ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. త‌నే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఆస‌క్తితో ఉన్నాన‌ని తెలిపారు. అమీర్ ఖాన్ సైతం మహాభార‌తం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్ర‌క‌టించారు. దీంతో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే .. ఆ సినిమాలో అమీర్ న‌టిస్తారంటూ ప్ర‌చారం సాగింది. కానీ అవేవీ ఇప్ప‌ట్లో అయ్యే ప‌నులు కావ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. మ‌హాభార‌తం నా డ్రీమ్ అని చెప్పాను కానీ, ఇప్ప‌ట్లో తీస్తాన‌ని చెప్ప‌లేదు అంటూ రాజ‌మౌళి మొన్న‌నే క్లారిటీనిచ్చారు.

తాజాగా అమీర్ ఖాన్ సైతం ఇదే త‌ర‌హా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌హాభార‌తం కోసం జీవితంలో 15-20 సంవ‌త్స‌రాలు కేటాయించాలి. అది నా వ‌ల్ల కాదేమో అనిపించింద‌ని వ్యాఖ్యానించారు. ఒక‌వేళ చేస్తే క‌ర్ణుడు, అర్జునుడు పాత్ర‌లో న‌టిస్తాన‌ని అన్నారు. అయితే ఆ పాత్ర‌ల‌కు త‌న ఫిజిక్ స‌రిపోదేమో! అన్న సందేహం వ్య‌క్తం చేశాడు. అలాగే కృష్ణుడిగా స‌రిపోతాన‌ని తెలిపారు. అర్జునుడి పాత్ర దాతృత్వం త‌న‌కు ఇష్ట‌మ‌ని అన్నారు. మొత్తానికి మ‌హాభార‌తం ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతోంది కానీ, ఇంత‌వ‌ర‌కూ ఒక్క ప‌రిశ్ర‌మ‌లోనూ మ‌హాభార‌తం సెట్స్‌కెళ్లింది లేదు. ముహూర్తం అయినా చేసుకున్న‌ది లేదు.

  •  
  •  
  •  
  •  

Comments