హుక్కా మ‌త్తులో థ‌గ్ అమీర్ ఖాన్‌

Thursday, September 13th, 2018, 05:30:58 PM IST

2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీగా థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ పేరు మార్మోగిపోతోంది. పీకే, దంగ‌ల్, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ లాంటి సంచ‌ల‌న విజ‌యాల త‌ర్వాత అమీర్ ఖాన్ న‌టిస్తున్న గ్రేట్ మూవీగా ప్ర‌చారం సాగుతోంది. `ధూమ్ 3` ఫేం విజ‌య్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అమీర్ ఖాన్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఫాతిమ స‌నా షేక్‌, క‌త్రిన వంటి భారీ కాస్టింగ్ తో దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే రివీలైన ఫోటోల‌కు అద్భుత స్పందన వ‌చ్చింది.

తాజాగా క‌త్రిన లీక్ చేసిన వేరొక ఫోటో అమీర్ ఖాన్ అస‌లు రూపాన్ని బ‌య‌ట‌పెట్టింది. నాడు బంధిపోటు దొంగ‌లు దోచుకున్న సొమ్ముల‌తో ఎంత చిద్విలాసంగా లైఫ్‌ని ఎంజాయ్ చేసేవారో ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. అయితే థ‌గ్స్ గా మారిన వాళ్లంతా చెడ్డ‌వాళ్లా? అంటే అదేం కాదని ఈ సినిమాలో సందేశం ఇస్తార‌ని తెలుస్తోంది. గ‌మ్మ‌త్తుగా పైప్ లోంచి హుక్కా పీల్చుతూ అమీర్ ఖాన్ ఇలా క‌నిపించాడు. రాజ‌స్థాన్ ఎడారిలో, థాయ్ ల్యాండ్ రెయిన్ ఫారెస్ట్‌లో భారీ యాక్ష‌న్ సీన్స్‌ని తీశారు. దీపావ‌ళి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేయ‌నున్నారు. వ‌య‌సుతో ప‌ని లేకుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చెబుతున్నారు. ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ సినిమా మ‌రో సంచ‌ల‌నం అవుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments