ఇన్‌స్టాగ్ర‌మ్‌లోకి ప్ర‌వేశిస్తున్న అమీర్ అంకుల్‌!

Tuesday, March 13th, 2018, 09:43:22 PM IST

మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ 53వ పుట్టిన‌రోజు జ‌రుపుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. నేటి ఝామురేతిరి 12 గంట‌ల నుంచి అభిమానుల కంటిపై కునుకే ఉండ‌ద‌న‌డంలో సందేహ‌మే లేదు. మార్చి 14న‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అమీర్‌ఖాన్ ఈ స్పెష‌ల్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు? అంటే అందుకు స‌మాధాన‌మిది.

ఈసారి త‌న పుట్టిన‌రోజు వెరీ స్పెష‌ల్‌. ఓవైపు భార‌త్‌, మ‌రోవైపు చైనా రెండు మార్కెట్ల‌ను కొల్ల‌గొట్టిన ఉత్సాహంలో ఉన్నాడు. దేశంలోనే నంబ‌ర్ 1 హీరోగా వెలిగిపోతున్నాడు. అందుకే ఈ డే త‌న డే. అందుకే ఈ సంద‌ర్భంలో త‌న ఇన్‌స్టాగ్ర‌మ్ అకౌంట్‌ని ఓపెన్ చేస్తున్నాడు. ఇదే స‌రైన స‌మ‌యం అని భావించిన అమీర్ ఈ ఫోటోషేరింగ్ సైట్లో ఖాతాను ప్రారంభిస్తున్నాడు. ఇక‌పోతే తాను ఈ స్థాయికి ఎద‌గడం వెన‌క ఓ స్త్రీ మూర్తి ఉంది. త‌నే అమ్మ‌.. త‌న‌కు అమ్మ అంటే ఎంతో ఇష్టం. అందుకో అమ్మ రూపాన్ని ఓ అంద‌మైన చిత్త‌రువుగా స్కెచ్ వేసి దానిని త‌న‌కు కానుక‌గా ఇవ్వ‌నున్నాడు. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్లో జోరుమీదున్న అమీర్ ఇక‌మీద‌ట ఇన్‌స్టాగ్ర‌మ్ ద్వారాను వేగంగా అభిమానుల‌కు క‌నెక్ట‌య్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకు ఇంకెంతో స‌మ‌యం లేదు.. ఇంకొన్ని గంట‌లే.. ఇన్‌స్టాగ్ర‌మ్‌లో తొలి పోస్టింగ్ ఏమై ఉంటుందో? అత‌డు న‌టిస్తున్న థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 7న రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments