30 ఏళ్లుగా ఖాన్‌ల‌లోనే అజేయుడిగా..మూడు ద‌శాబ్ధాల పెర్ఫెక్ష‌నిస్ట్ అత‌డు!

Sunday, April 29th, 2018, 09:16:47 PM IST

రొటీన్‌గా అంద‌రూ వెళ్లే దారిలో వెళితే త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌త ఇంకేం ఉంటుంది? .. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అలాంటి త‌ప్పిదం ఏనాడూ చేయ‌లేదు. అందుకే అత‌డు న‌టించే ప్ర‌తి సినిమా ఓ ఆణిముత్యం. ప్ర‌తిదీ బ్లాక్‌బ‌స్ట‌రే. అస‌లు అప‌జ‌యం అన్న‌దే ఎరుగ‌ని మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అత‌డు. అందుకే మూడు ద‌శాబ్ధాల పాటు బాలీవుడ్‌ని ఏలాడు. ఇప్పుడు ఇండియ‌న్ సినిమాకి చైనా దారులు తెరిచాడు. మార్కెటింగ్ వ్యూహాల్లో మాష్ట‌ర్ మైండ్‌గా అమీర్ చూపిస్తున్న తెలివితేట‌లు ఇండియా గ‌వ‌ర్న‌మెంటుకే ఆలోచ‌న పుట్టిస్తోంది. వ‌ర‌ల్డ్ సినిమా ప‌రిశ్ర‌మ‌కు నేర్పించేంత‌టి గురూ అత‌డు.

అంత‌టి గ్రేట్ స్టార్ కెరీర్ ఇప్ప‌టికి మూడు ద‌శాబ్ధాలు పూర్త‌యింది. `ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్‌` (29 ఏప్రిల్ 1988) చిత్రంతో జూహీచావ్లా స‌ర‌స‌న క‌థానాయ‌కుడిగా న‌టించాడు అమీర్‌ఖాన్‌. ఆ త‌ర‌వాత అత‌డి కెరీర్ అజేయంగా ముందుకు సాగింది. ఇండ‌స్ట్రీలో ఖాన్‌ల త్ర‌యంలోనే ప్ర‌త్యేక‌త ఉన్న మొన‌గాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఖాన్‌ల‌లో ఆ ఇద్ద‌రికి ఏమాత్రం తీసిపోని, అంత‌కుమించిన ఏకైక ఖాన్ అమీర్‌ఖాన్ అన‌డంలో సందేహం లేదు. అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వీరాభిమానులు కోటానుకోట్లు. వీళ్లంతా ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు అంటే.. అమీర్ న‌టించిన తొలి సినిమా రిలీజైన స‌మ‌యం చూసుకుని అభిమానులంతా మూకుమ్మ‌డిగా అంత‌ర్జాలాన్ని చుట్టుముట్టారు. అక్క‌డ అమీర్ విజువ‌ల్స్‌తో అట్టుడికించారు. ట్విట్ట‌ర్, ఎఫ్‌బి, ఇన్‌స్టాగ్ర‌మ్ అన్నిచోట్లా అమీర్‌ఖాన్ వీడియోలే. అమీర్ ఫ్యాన్ పేజీల్లోనూ ఆస‌క్తిక‌ర వీడియోలు, పోస్ట‌ర్ల‌తో వెబ్‌ని ఠారెత్తించారు.

  •  
  •  
  •  
  •  

Comments