పాకిస్తాన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ .. అమెరికా హెచ్చరిక

Friday, September 29th, 2017, 05:54:22 PM IST


ఆధునిక యుగంలో చాలా దేశాలు ముందుకు వెళుతున్నాయి. ఎవరికీ వారు ప్రపంచ పటంలో తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలని అభివృద్దే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం ఇంకా మతాలు పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. చెడ్డ పేరును తెచ్చుకుంటున్నాయి. పాలనను మరచిపోయి పగలతో పాముల మారి ఇతర దేశాలపై బుసలు కొడుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో పాకిస్తాన్ కూడా ప్రవర్తిస్తోందని అగ్ర రాజ్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా – పాకిస్తాన్ మధ్య వాతావరణం అస్సలు బాగాలేదు. ఓ వైపు తాము ఉగ్రముఖలు లేకుండా చేయాలనీ పోరాడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు స్థావరాలని కల్పిస్తోందని అమెరికా చెబుతోంది. ప్రస్తుతం అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులను లేకుండా చెయ్యడానికి చాలా కృషి చేస్తోంది. అసలైన ఉగ్రవాదులు ఆ పరిసరాల్లోనే ఉన్నారని వారిని లేపేస్తే మిగతా ఉగ్ర ముఖాలు కూడా అంతమైనట్టేనని అక్కడ పోరాడుతోంది.అయితే ఆఫ్ఘనిస్తాన్‌ అందుకు చాలా ఉపయోగపడుతోంది. కానీ సమీపాన ఉన్న పాకిస్తాన్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయ వచ్చే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయాన్ని కల్పిస్తోంది. అంతే కాకుండా అమెరికా పోరాటానికి అంతరాయం కలుగజేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్‌ తెలిపారు. ఇకనైనా ఆ వంకర బుద్దులు మానుకోవాలని హెచ్చరించారు. అంతే కాకూండా ఇదే చివరి అవకాశమని చెబుతూ.. తమ ఓపికకు పరీక్ష పెడితే ఇక మీ ఖర్మ అనే విధంగా మాటిస్‌ వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments