కుక్కని వద్దంటే… కుక్క కంటే హీనంగా! పోలీసుల నిర్వాకం!

Thursday, September 28th, 2017, 02:14:27 PM IST

ప్రయాణికులే తమకు దేవుళ్లు – వారి సౌకర్యమే తమకు ఇష్టమని చెప్పే ఎయిర్ లైన్స్ సంస్థ మరోసారి ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించింది. సమస్య ఏంటి అనే విషయం గురించి ఆలోచించకుండా వారు చేసిన పనికి సర్వత్రా తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఏ మాత్రం ఆలోచించకుండా అభ్యంతరం చెప్పినందుకు మహిళా ప్రయాణికురాలిని పోలీసుల చేత బయటకి నెట్టి వేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో సౌత్‌ వేస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో బాల్టిమోర్‌ నుంచి లాస్‌ఏంజిల్స్‌కు వెళ్లడానికి ఓ మహిళ సిద్ధమైంది. అయితే విమానంలో రెండు శునకాలు కూడా ఉన్నాయి.

దీంతో తనకు కుక్కలంటే అలర్జీ అని వాటి వల్ల భయానక జబ్బులు సోకె అవకాశం ఉందని చెబుతూ.. వెంటనే కుక్కలను బయటకి పంపించాలని విమాన సిబ్బందికి పిర్యాదు చేసింది. అయితే అందుకు విమాన సిబ్బంది ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమెనే వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో మహిళ వాగ్వివాదానికి దిగింది. వెంటనే పోలీసులను పిలిపించి ఆ ప్రయాణికురాలిని బయటకు నెట్టి వేశారు. మహిళ అని ఏ మాత్రం గౌరవం లేకుండా దారుణంగా ఆమెను ఈడ్చుకెళ్లారు పోలీసులు. దీంతో మహిళ తన మీద చేతులు వెయ్యకండి నేను నాకు నడిచి వెళ్ళగలను, నేను ఒక ప్రొఫెసర్ అని చెప్పినా కూడా పోలీసులు ఆమెను పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్స్ తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఒక మహిళ కు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు కామెంట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments