బాహుబలి 2 ఇంకా చూడలేదు.. ప్రభాస్ యాక్టింగ్ సూపర్బ్ : అమిర్ ఖాన్

Saturday, October 14th, 2017, 12:12:51 PM IST

సినిమా ఎంత చిన్నదైనా సరే అమిర్ ఖాన్ అందులో ఉంటే ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. బాలీవుడ్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన అమిర్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చిన అయన మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో మరోసారి తెలుగు సినిమాల గురించి ప్రస్తావించారు. తెలుగు నుంచి ఏదైనా కథ వస్తే చేయడానికి సిద్దమే.. మంచి కథ వస్తుందనే నమ్మకంతో తాను ఉన్నానని అమిర్ తెలిపాడు.

అదే విధంగా బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.. బాహుబలి మొదటి పార్ట్ చూశాను. కానీ రెండవ పార్టీ చూడలేదు. త్వరలోనే ప్రశాంతంగా ఆ సినిమాను చూస్తాను. బాహుబలి 1 లో ప్రభాస్ యాక్టింగ్ సూపర్బ్ అంటూ.. రాజమౌళి డైరెక్షన్ కూడా తనకు బాగా నచ్చిందని పొగిడారు. ఇక రాజమౌళి గారు మహాభారతం తీస్తారో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం అలాంటి ఒక సినిమాను చెయ్యాలని అనుకుంటున్నట్లు అమిర్ తెలిపాడు. అదే విధంగా అందులో కర్ణుడి పాత్ర చెయ్యాలని ఉందని వివరిస్తూ.. కృష్ణుడి పాత్ర కూడా తనకు చాలా ఇష్టమని అమిర్ చెప్పాడు.