కూతురితో అమిర్ ఆటలు.. నెటిజన్స్ ఫైర్!

Thursday, May 31st, 2018, 12:16:34 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎంత సరదాగా ఉంటారో అందరికి తెలిసిందే. ఫాన్స్ తో అయినా మీడియాతో అయినా నవ్వుతూ మాట్లాడుతుంటారు. అదే విధంగా తన కుటుంబ సభ్యులతో కూడా అమిర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడు లేని విధంగా అమిర్ ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన కూతురు ఇరా ఖాన్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చాలా అసభ్యకరంగా ఉందని పోస్ట్ చేయకుండా ఉండాల్సిందని చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ముస్లిం వర్గాల నుంచి అయితే ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. రంజాన్ మాసంలో ఇరా ఖాన్ అలాంటి డ్రెస్ లో వేసుకోవడం ఏమిటని పైగా వయసొచ్చిన కూతురితో ఆ ఆటలేంటని మండిపడుతున్నారు. ఇక మరికొందరు అమిర్ కు మద్దతు పలుకుతున్నారు. లింగ భేదాలతో విలువ తగ్గించుకోవద్దని ఆ స్థానంలో కోడుకి ఉండి ఉంటే ఈ విధంగా మాట్లాడేవారా? అని కామెంట్ చేస్తున్నారు.