చైనాలో మరోసారి సత్తా చాటిన అమిర్ ఖాన్!

Friday, January 26th, 2018, 03:30:14 PM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ సినిమా వస్తోంది అంటే చాలు ఎదో కొత్త ప్రయోగం వెండి తెరపై కనిపించబోతోంది అని అందరు అనుకుంటారు. అంతే కాకుండా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం కాయమని అనుకుంటారు. అయితే ఇప్పుడు చైనాలోని సినీ అభిమానులు కూడా అదే తరహాలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దంగల్ సినిమా అక్కడ ఎంత పెద్ద ఘనవిజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అందులో ఎమోషనల్ డ్రామా వారికి బాగా కనెక్ట్ అయ్యింది. ఏకంగా అక్కడి అధ్యక్షుడే ఆ సినిమా చూసి దంగల్ టీమ్ ను ప్రశంసించాడు.

దీంతో అమిర్ కి అభిమానులు అక్కడ చాలా పెరిగిపోయారు. అయితే గత ఏడాది అమిర్ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాను చైనాలో కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా మొత్తంగా ఇప్పటి వరకు రూ.294.61కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా సంగీతం నేపథ్యంలో తెరకెక్కింది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జైరా వశీం, మహీర్‌ విజ్‌, రాజ్‌ అర్జున్‌ తో పాటు అమిర్ ఖాన్ ఒక స్పెషల్ రోల్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments