అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ.. ఏమేమి చర్చించారంటే?

Friday, June 11th, 2021, 01:15:50 AM IST

కేంద్రం హోం మంత్రి అమిత్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన అనేక కీలకమైన అంశాలను సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు కొత్త అంచనాలను ఆమోదించాలని, ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

అయితే రాష్ట్రంలో పేదలకు పెద్ద సంఖ్యలో ఇల్లు కట్టించే అంశంపై కూడా అమిత్ షాతో చర్చించిన సీఎం జగన్ దీని కోసం కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేయాలని కోరినట్టు తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా మాట్లాడిన సీఎం జగన్ దీనిపై కేంద్రం యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరినట్టు సమాచారం. ఇక అంతకు ముందు కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్‌తో పాటు గజేంద్రసింగ్ షెకావత్‌తో కూడా సీఎం జగన్ సమావేశమయ్యారు.