బాలయ్య అమితాబ్ ఏం మాట్లాడుకున్నారు ?

Friday, November 4th, 2016, 11:45:15 PM IST

balayya-amitabh
కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ కృష్ణ వంశీ ని వెంటబెట్టుకుని మరీ ముంబై వెళ్ళిన బాలయ్య అమితాబ్ ని కలిసిన సంగతి తెలిసిందే సర్కార్ 3 సెట్ లో ఆయన్ని కలిసి బోలెడు విషయాలు మాట్లాడారు. ఇంతకీ అంత హడావిడిగా బాలయ్య ముంబై వెళ్లి మరీ సర్కార్ ని ఎందుకు కలిసారు అంటే బాలయ్య చెయ్యబోతున్న 101 వ చిత్రం రైతు కోసం అమితాబ్ ని కలవడం ఆ సినిమాలో ఆయన చెయ్యాల్సిన పాత్ర గురించి చెప్పడం, దానికి అమితాబ్ ఓకే చెప్పడం ఇవన్నీ ఓకే అయ్యాయి. అయితే అధికారికంగా మాత్రం ఆ విషయం గురించి అటు బాలకృష్ణగానీ – ఇటు కృష్ణవంశీగానీ ఇప్పటిదాకా స్పందించనేలేదు. రాష్ట్రపతి పాత్రలో అమితాబ్ బచ్చన్ ఆ సినిమాలో కనిపిస్తారు అని చెబుతున్నాయి కొన్ని వర్గాలు. నిజంగా బాలకృష్ణకి అమితాబ్ ఏం చెప్పాడో ఏంటో ఎవ్వరికీ తెలియదు కానీ… అమితాబ్ పోషిస్తాడని ప్రచారంలో ఉన్న రాష్ట్రపతి పాత్ర విషయంలో మాత్రం దర్శకుడు కృష్ణవంశీకి బాలకృష్ణ పలు సూచనలు చేశాడట. తనకి చెప్పినదానికంటే బలంగా ఆ పాత్ర ఉండాలని ఆయన స్పష్టం చేశాడట. దాంతో ఇప్పుడు కృష్ణవంశీ ఆ పాత్రపై మళ్లీ తన బృందంతో కలిసి చర్చలు జరుపుతున్నాడట. అడగ్గానే బిగ్ బీ ఒప్పుకున్నాడు కాబట్టి పాత్ర విషయంలో ప్రాధాన్యం విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూదని ఆ పాత్ర తెరపై ఎంతో హుందాగా ఉండాలనేది బాలకృష్ణ ఆలోచనట. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు సమాచారం.