అమితాబ్ చేసిన పనికి షాక్ అవుతున్న యావత్తు భారతదేశం

Wednesday, June 12th, 2019, 08:15:30 PM IST

చాలా విషయాలు చెప్పటం సులువు, వాటిని చేతుల్తో చేసి చూపించాలంటే చాలా కష్టమైన పని, కానీ కొందరు తాము చెప్పిన మాటలను చేసి చూపిస్తుంటారు. నిజానికి సినిమా హీరోలు అవినీతి కోసం పోరాడిన, రైతుల కోసం పోరాడిన కేవలం అది సినిమా కోసమే చేస్తారు తప్ప, నిజ జీవితంలో చేయరని ఒక అపోహ ఉంటుంది. దానిని అపోహ అనటం కంటే వాస్తవం అనే చెప్పాలి. తమ సినిమాల్లో దేశాన్ని ఉద్ధరించే కొందరు హీరోలు, రియల్ లైఫ్ లో కనీసం ఒకరిని కూడా ఉద్ధరించే పనులు చేయరు. మాటలకే పరిమితం తప్ప, చేతలకు చేతకాని కొందరు హీరోలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ బిగ్ బి అమితాబ్ ని చూసి కొంచమైనా మారాలి.

పగలు,రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసిన కానీ, సరైన ఆదాయం లేక,అప్పులు పాలైన రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా అప్పులు పాలైన రైతుల కష్టాలను తీర్చటానికి అమితాబ్ ముందుకి వచ్చాడు. రైతుల అప్పులను ఆయనే స్వయంగా తీరుస్తానని చెప్పాడు. కేవలం మాటలతో సరిపెట్టకుండా రైతుల అప్పులు తీర్చాడు. ఎదో ఒక యాభై,వందమంది రైతులు అప్పులు కాకుండా ఏకంగా 2100 మంది బీహార్ రైతుల అప్పులు తీర్చాడు..వాళ్లల్లో కొందరికి అప్పు తీర్చేయగా, మరికొందరి అప్పు మొత్తాన్ని వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేసినట్లు తెలుస్తుంది. అమితాబ్ ఇలా రైతుల అప్పులు తీర్చటం మొదటి సారి కాదు..గతంలో కూడా అనేక మంది రైతుల అప్పులు తీర్చిన నిజమైన మెగాస్టార్ బిగ్ బి అమితాబ్.

ఇలా ప్రతి హీరో కూడా అనుకుంటే వాళ్ళకి ఉన్న స్థాయిలోనే రైతులను ఆదుకుంటే రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయి, మనకి అన్నం పెట్టె రైతన్న పదికాలాలు పాటు సుఖంగా ఉంటాడు, కానీ రైతుల ఆత్మహత్యల మీద, వాళ్ళ కష్టాల మీద సినిమాలు తీస్తూ కోట్లకి కోట్లు గడిస్తూ ఏసీ కారుల్లో తిరిగే హీరోలు, మట్టి పిసుక్కోని ఆరుగాలాలు కష్టపడే రైతుల యొక్క కష్టాలు వాళ్ళకి తెలుస్తాయా..? తెలిసిన తీరుస్తారా..? కనీసం ఇప్పుడైనా అమితాబ్ చేసిన గొప్ప పనిచూసి కొందరైనా ఆయనలాగా చేస్తే రైతుల కష్టాలు కొంచమైనా తీరుతాయి. మన టాలీవుడ్ లో కూడా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. ఒక్కో సినిమాకి 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే నటులు నలుగురైదుగురు ఉన్నారు..కనీసం వాళ్ళైనా ఈ మార్గంలో నడవాలని కోరుకుందాం.