అంత పెద్ద విషయాన్ని మరచిపోయిన అమితాబ్..!

Wednesday, February 15th, 2017, 11:55:14 PM IST


భారత నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతున్నాడు. ట్విట్టర్ లో ఆయన అరుదైన ఘనతని అందుకున్నారు.అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతాకు 25 మిలియన్ ఫాలోవర్ లు దక్కారు. దీనిపై అమితాబ్ బచ్చన్ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఆనందంతో పొంగిపోతూ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. ”నేను ఈ విషయాన్ని గమనించడం మరచిపోయాను. యాహూ..25 మిలియన్లు” అని ట్వీట్ చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీకి 27. 1మిలియన్ ఫాలోవర్ లు ట్విటర్ లో ఉండగా, అమితాబ్ 25 మిలియన్లతో కొనసాగుతున్నారు. షారుఖ్ ఖాన్ 23. 4 మిలియన్ , సల్మాన్ ఖాన్ 21. 5 మిలియన్ తో కొనసాగుతున్నారు. దీపికా పదుకొనె 17. 4 మిలియన్ , ప్రియాంక చోప్రా 16.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే 13.9 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు.