బిగ్ న్యూస్ : విజయసాయి రెడ్డికు అమిత్ షా వార్నింగ్..కారణం ఇదే!

Monday, November 18th, 2019, 12:00:29 AM IST

ఈరోజు ఆదివారం పెనిడింగ్ లో ఉన్నటువంటి బిల్లులు మరియు ఇతర అంశాలకు సంబంధించిన అఖిల పక్ష సమావేశం ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే.అయితే ప్రధాని మోడీ మరియు బీజేపీ హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగినటివంటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పాల్గొని ఏపీ రావాల్సిన పెండింగ్ నిధుల గురించి చర్చించారు.ఇదిలా ఉండగా తాను లేవనెత్తిన ఓ అంశం విషయంలో అమిత్ షా విజయసాయి రెడ్డిపై ఫైర్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న కాంగ్రెస్ లీడర్ చిదంబరంను పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యేందుకు అవకాశం కల్పించాలని ఈ మీటింగులో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అడగ్గా దానికి విజయసాయి రెడ్డి మధ్యలో కలుగజేసుకొని గతంలో తమ పార్టీ అధినేత 16 నెలలు జైల్లో ఉన్నపుడు మాత్రం ఇవ్వలేదు కానీ ఇప్పుడు చిదంబరంకు అనుమతి ఇవ్వాలని ఎలా కోరుతున్నారని అడగ్గా అక్కడ ఇతర పార్టీల నేతలు కాస్త సీరియస్ అయ్యారని దీనితో కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది మీకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలుగజేసుకుంటున్నావని షా విజయసాయి రెడ్డికు చురకలంటించి అసహనం వ్యక్తం చేసారని సమాచారం.