టీవి9 వివాదంపై క‌న్నేసిన అమిత్ షా?

Thursday, June 6th, 2019, 04:10:50 PM IST

టీవి 9 వివాదం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నవిష‌యం తెలిసిందే. ఫోర్జ‌రీ పంత‌కం, నిధుల మ‌ళ్లింపు, టీవి9 లోగో అమ్మ‌కం వంటి అభియోగాల‌తో టీవి9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్ కోసం సైబ‌రాబాద్ పోలీసులు గ‌త నెల రోజులుగా గాలిస్తున్న విషయం తెలిసిందే. అరెస్ట్ నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం ర‌విప్ర‌కాష్ ముందస్తు బెయిల్ కావాల‌ని రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే అది కుద‌ర‌ని ప‌ని అని హైకోర్టు తేల్చ‌డంతో సుప్రీమ్ గ‌డ‌ప తాకారు. అక్క‌డా ర‌విప్ర‌కాష్‌కు చుక్కెదురు కావ‌డంతో చేపేది లేక మంగ‌ళ‌వారం సీసీఎస్ పోలీసుల ఎదుట ర‌విప్ర‌కాష్ లొంగిపోయిన విష‌యం తెలిసిందే.

సీసీఎస్ పోలీసుల విచార‌ణ‌కు బుధ‌వారం హాజ‌రైన ర‌విప్ర‌కాష్ తెలంగాణ‌లో మీడియాను మాఫియా హ‌స్త‌గ‌తం చేసుకుంటోంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వివాదం మ‌రింత జ‌ఠిలంగా మ‌రుతోంది. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని చెబుతూనే సీసీఎస్ పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ర‌విప్ర‌కాష్ స‌మాధానాలు చెప్ప‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అయితే ఈ ఉదంతంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి, బీజేపీ బాస్ అమిత్ షా దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అస‌లు టీవి 9 వివాదం ఎందుక‌వుతోంది?. అస‌లు దీని వెన‌కున్న అస‌లు క‌థ ఏంటి? అన్న విష‌యాల‌పై పూర్తి స‌మాచారం త‌న‌కు కావాల‌ని అమిత్ షా అధికారుల్ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని తెరాస‌ను అన్ పాపుల‌ర్ చేస్తారా? లేక ర‌విప్ర‌కాష్‌కే ఆల్టిమేట‌మ్ జారీ చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి.