అందులో అమితాబ్ నటించడం లేదంటున్న వర్మ ?

Wednesday, November 15th, 2017, 10:13:21 AM IST

సంచలన దర్శకుడు వర్మ మళ్ళీ మాట మార్చాడు.. తాజాగా అయన దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించే సినిమాలో అమితాబ్ నటిస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ తో పాటు టబు కూడా నటిస్తుందని అన్నారు.. అయితే తాజాగా ఈ వార్తలపై వర్మ స్పందించాడు.. ఈ విషయం గురించి పేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు ..నాగార్జున నటిస్తున్న సినిమాలో టబు, అమితాబ్ లు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇది పక్క అబద్దమని తెలిపారు. తెలుసు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచినా శివ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కే ఈ సినిమాకోసం వర్మ పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసాడట, వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియచేస్తామని అన్నాడు.

Comments