సైరా కోసం నరకం అనుభవిస్తున్నానంటున్న బిగ్ బి ?

Monday, April 2nd, 2018, 10:45:27 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ నటుడు అమితాబ్ నటిస్తున్నారు. తాజగా అయన ఈ సీనిమా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనాం రేపుతున్నాయి. అమితాబ్ తన సోషల్ మీడియా లో ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ .. చిరంజీవి సినిమాకోసం నరకం అనుభవిస్తున్నానని అయన సోషల్ మీడియా కామెంట్ పోస్ట్ చేసారు. ఇంత షాకింగ్ గా అమితాబ్ ఎందుకు ఆ మాట అన్నట్టు అంటూ ప్రేక్షకుల ఆరాలు మొదలయ్యాయి.

అయితే అసలు విషయంలోకి వెళితే చిరంజీవి సైరా సినిమాలో అమితాబ్ రాజగురువుగా కనిపించనున్నాడు. ఇందులో అయన పాత్రకోసం భారీ గడ్డం, విగ్ పెట్టాల్సి వచ్చింది. తాను ఎప్పుడు ఏ సినిమాలో కూడా గడ్డం, విగ్ పెట్టుకొని నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడట అప్పట్లోనే .. ఆ తరువాత అయన ఏ సినిమాలో గడ్డం, విగ్ ను ధరించ లేదు .. కానీ చిరంజీవి కోరిక మేరకు ఈ సినిమాలో గడ్డం తో నటిస్తున్నాడు. అసలే ఎండాకాలం .. ఆపై గుబురు గడ్డం .. విగ్ అంటే ఎలా ఉంటుందో కదా !! ఈ చిరాకు తోనే అయన ఆ డైలాగ్ వాడాడు .. అది విషయం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహిస్తుండగా .. రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.