గ్రేట్ ఆర్ట్ : వ్వాటే ఫ్యాన్ బ‌చ్చ‌న్ జీ

Sunday, March 25th, 2018, 12:08:14 PM IST


గ్రేట్ బ‌చ్చ‌న్ జీ.. రెండు గ్రేట్ విష‌యాలు. ఒక‌టి బ‌చ్చ‌న్‌జీ వీరాభిమాని త‌న‌పై ఎంతో ప్రేమ‌తో గీసిన ఆర్ట్‌. ఇంకోటి త‌న‌కు వార‌స‌త్వ హ‌క్కుగా ద‌క్కాల్సిన తన తండ్రిగారి ర‌చ‌న‌ల‌పై హ‌క్కును కోల్పోయిన బాధ‌.. లేటెస్టుగా బ్లాగులో బిగ్‌బి త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. తండ్రి హ‌రివంశ్ రాయ్ బ‌చ్చ‌న్ ర‌చ‌న‌లు మ‌ధుశాల‌, అగ్నిప‌థ్‌, రూక్ నా తు, హిమ్మ‌త్ క‌ర్నే వాలోంకి హ‌ర్ న‌హీ హోతీ.. వంటి వాటిపై త‌న‌కు హ‌క్కు లేద‌ని కోర్టుల ప‌రిధిలో గొడ‌వ జ‌ర‌గ‌డంపై తీవ్రంగా హ‌ర్ట‌య్యాన‌ని అమితాబ్ బ్లాగులో రాశారు. చ‌ట్ట‌ప‌రంగా వాటిపై త‌న‌కే హ‌క్కు ఉండాల‌ని.. అలా కాకుండా ఈ 1957 కాపీ రైట్ చ‌ట్టం లిటిగేష‌న్ ఏంట‌ని ప్ర‌శ్నించారు.

నాన్న‌గారు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం రాసుకున్న పుస్త‌కాల‌వి. 2003లో మ‌ర‌ణించారు. ఆ త‌ర‌వాత ఆయ‌న ర‌చ‌న‌ల‌పై కొడుకుగా త‌న‌కే హ‌క్కులు ఉండాల‌ని అన్నారు. చ‌ట్ట ప‌రంగా త‌న‌కు అడ్డంకి ఎదుర‌వ్వ‌డం న‌చ్చ‌లేద‌ని విచారం వ్య‌క్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే ప్ర‌ఖ్యాత క‌మెడియ‌న్ జానీ లీవ‌ర్ ట్విట్ట‌ర్‌లో త‌న‌కు ఓ వీరాభిమాని షేర్ చేసిన ఆర్ట్‌ను ఎంతో సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో మెచ్చుకున్నారు. బిగ్ బిపై వీరాభిమానులు ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ ఆర్ట్ రూపంలో అభిమానం వ్య‌క్త‌ప‌ర‌చ‌డం తెలిసిందే.