అరుణ్ జైట్లీ కోసం మాట్లాడుతూ, భావోద్వేగానికి గురైన అమిత్ షా…

Sunday, August 25th, 2019, 01:27:12 AM IST

నేడు కొద్దీ గంటల క్రితం కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తుడు శ్వాస విడిచిన సంగతి మనకు తెలిసిందే… కాగా ఈమేరకు మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ… తన జీవితంలో సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా అరుణ్ జైట్లీ తనకు అండగా నిలబడ్డారని, అలంటి వ్యక్తిని నేడు ఇలా చూడటం చాలా బాధాకరమైన విషయం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అరుణ్ జైట్లీ మరణం అనేది వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం అని అమిత్ షా అన్నారు… అంతేకాకుండా అరుణ్ జైట్లీ మనదేశానికి చాలా సేవ చేశారు… ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు అమిత్ షా తెలిపారు. కాగా ఈమేరకు జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, తన కుటుంబ సభ్యులందరికి కూడా దైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.

ఇకపోతే జైట్లీ మరణం అనేది పార్టీ కి తీరని నష్టం అని, కార్యకర్తలందరు కూడా దైర్యంగా ఉండాలని ఈమేరకు అమిత్ షా అన్నారు. కాగా అరుణ్ జైట్లీ విద్యార్ధి దశలోనుండే నాయకుడిగా ఎదిగాడని, ఆ కాలంలోనే ఎమర్జెన్సీ సమయంలో 19నెలలు జైల్లో గడిపిన వ్యక్తిగా,ఓ పార్లమెంటేరియన్ గా ప్రజలందరి తరపున చాలా పోరాడేవాడని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేసుకున్నారు.