హిందీ భాష నేర్చుకోవాలని నెం చెప్పలేదు – క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

Wednesday, September 18th, 2019, 11:43:26 PM IST

కేంద్రప్రభుత్వం సూచించినటువంటి హిందీ భాష వ్యవహారంపై తీవ్రమైన దుమారాల వెల్లువెత్తుతున్నాయి. మన భారతదేశం అంతటా కూడా హించి భాష ఉండాలని కేంద్రం కీలకమైన నిరణాన్ని తీసుకుంది. కాగా ఈ విషయంలో దక్షణాది రాష్ట్రాలన్నీ కూడా ఒక రకమైన పోరాటాన్ని చేస్తున్నాయి. కాగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త దిగొచ్చింది చెప్పాలి. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అందరికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. హిందీని కేవలం ద్వితీయ భాషగానే నేర్చుకోవాలని, వారి మాతృ భాషనీ పక్కనపెట్టామని తాను చెప్పలేదని వివరణ ఇచ్చారు అమిత్ షా. ఎవరికైనా కూడా వారి మాతృ భాష తరువాతే మిగతా భాష అని స్పష్టం చేశారు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువాని దక్షణాది రాష్ట్రాలన్నీ కూడా త్వరలోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ఆగ్రహంతో రగిలిపోతున్న కొందరు నాయకులూ, కేంద్ర హోంమంత్రి ఇచ్చిన క్లారిటీతో వెనక్కి తగ్గారని సమాచారం. ఇకపోతే ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ… ప్రాంతీయ భాషలు కాకుండా హిందీ భాషే నేర్చుకోవాలని నేనెక్కడా చెప్పలేదు. మాతృభాష తర్వాత హిందీని ద్వితీయ భాషగానే నేర్చుకోవాలని మాత్రమే సూచించా. నేను కూడా హిందీ మాతృభాష కాని గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చా. దీనిపై కొందరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది వారి ఇష్టం అని వాఖ్యానించారు.