సాంగ్ ప్రోమో : బాలయ్య స్టెప్స్ అదుర్స్..నటాషాతో కలసి దుమ్ములేపేశాడు..!

Monday, January 1st, 2018, 12:01:19 PM IST

బాలయ్య వెండి తెరపై ఏం చేసిన ఆయన ఫాన్స్ రచ్చ మాములుగా ఉండదు. లాంటిది అందమైన భామతో కలిసి అదిరిపోయే స్టెప్పులేస్తే.. థియేటర్ లు దద్దరిల్లాల్సిందే. జైసింహా చిత్రం విడుదలయ్యాక ఇది జరగడం ఖాయంగా కనిపిస్తోంది. యంగ్ బ్యూటీ నటాషా దోషి తో ‘అమ్మ కుట్టి అమ్మ కుట్టి’ అనే సాంగ్ లో బాలయ్య స్టెప్పులు ఇరగేశాడు. నటాషా అందాలు ఓ వైపు హై లైట్ అవుతుంటే.. మరో వైపు బాలయ్య స్టెప్పులతో రెప్ప ఆర్పడం కష్టం.

కె ఎస్ రవికుమార్ తెరకెక్కించిన జై సింహా చిత్రంలో సాంగ్ ప్రోమోని తాజాగా నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. 45 సెకండ్ల ప్రోమోలో సాంగ్ పిక్చరైజేషన్ చాలా బావుంది. నటాషా దోషి గ్లామర్ లుక్ లో అదరగొడుతూనే బాలయ్యకు ధీటుగా డాన్స్ చేసి ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ చితం జనవరి 12 న విడుదల కానుంది. సాంగ్ ప్రోమో పై మీరూ ఓ లుక్కేయండి..